: ఆస్ట్రేలియాలో ’మోదీ ఎక్స్ ప్రెస్’!


మొన్న అగ్రరాజ్యం అమెరికా, నేడు ఆస్ట్రేలియా... దేశాలేవైతేనేం, భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను తమ చరిత్ర పుటల్లో నిలుపుకునేందుకు తహతహలాడుతున్నాయి. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ వద్ద మోదీ చేసిన ప్రసంగం అమెరికా చరిత్ర పుటలకెక్కింది. తాజాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నవంబర్ 15న అస్ట్రేలియాలో అడుగుపెట్టనున్నారు. అనంతరం నవంబర్ 17న అక్కడి భారత సంతతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని భారత సంతతి ఓ అరుదైన ఘట్టానికి తెర తీశారు. ’మోదీ ఎక్స్ ప్రెస్’ పేరిట ప్రత్యేక రైలును మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి పరుగులు పెట్టించనున్నారు. 870 కిలో మీటర్ల మేర ప్రయాణించనున్న మోదీ ఎక్స్ ప్రెస్ లో కేవలం 220 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా దీనిలో ప్రయాణించేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే నాలుగు బోగీల మోదీ ఎక్స్ ప్రెస్ లో 220 మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నట్లు ఇండియన్ ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ అధికార ప్రతినిధి బాలేశ్ సింగ్ ధంకార్ చెప్పారు.

  • Loading...

More Telugu News