: గుజరాత్, పాకిస్థాన్ ల మధ్య తీరం దాటనున్న పెను తుపాను 'నీలోఫర్'


గుజరాత్ లోని నలియాకు నైరుతి దిశగా అరేబియా సముద్రంలో 1240 కి.మీ. దూరంలో నీలోఫర్ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ఈ నెల 31న గుజరాత్, పాకిస్థాన్ ల మధ్య తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నీలోఫర్ మరింత బలపడి పెనుతుపానుగా మారబోతోందని తెలిపింది. తుపాను నేపథ్యంలో, గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయింది. తీర ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మరో 48 గంటలు గడిస్తే గాని, తుపాను కచ్చితంగా ఏ ప్రాంతంలో తీరం దాటుతుందో చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో తుపాను కొంత మేర తన దిశను మార్చుకునే అవకాశాలు ఉండవచ్చని వెల్లడించారు.

  • Loading...

More Telugu News