: 60 గంటల్లో రూ.100 కోట్లు...‘హ్యాపీ న్యూ ఇయర్’ రికార్డుల మోత!
దీపావళి పర్వదినాన ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాక విడుదలైన 60 గంటల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. విడుదలైన తొలి రోజే రూ.45 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను సొంత చేసుకోవడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను చవిచూసిన ఈ చిత్రం హిందీ వర్షన్ తో పాటు తెలుగు, తమిళ వర్షన్లు కూడా కలెక్షన్ల మోత మోగిస్తున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే, సోనూ సూద్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.