: కరవు జిల్లాలో భారీ వర్షాలు
కరవు జిల్లాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో, జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని శెట్టూరులో 16 సెం.మీ, బొమ్మనహాల్, బ్రహ్మసముద్రంలలో 11, హీరేహాల్ మండలంలో 9 సెం.మీ, గుమ్మగట్ట, గుత్తిలలో 6 సెం.మీ. వర్షపాతం నమోదయింది. ఈ వర్షాల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో చెరువుకు గండి పడి... చెరువులోని వరద నీరు గ్రామంలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.