: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఈ ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ దంపతులు, పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News