: వాద్రా భూ వ్యవహారంపై దర్యాప్తు: ఖట్టర్ సర్కారు ప్రకటన


హర్యానాలో అధికార పగ్గాలు చేపట్టిన గంటల వ్యవధిలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూ వ్యవహరాలపై దర్యాప్తు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఈ తరహా కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ భావించినా, మరీ ఇంత త్వరగా ఖట్టర్ సర్కారు స్పందిస్తుందని ఎవరూ ఊహించలేదు. "ఈ కేసును తిరిగి తెరుస్తున్నాం. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాం" అని ఖట్టర్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పరిగణిస్తున్న రామ్ విలాస్ శర్మ చెప్పారు.

  • Loading...

More Telugu News