: 30న మన్యం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
ఈ నెల 30వ తేదీన మన్యంలో బంద్ పాటించాలని మావోయిస్టు తూర్పు డివిజన్, ఆంధ్రా-ఒడిశా స్పెషల్ గెరిల్లా జోన్ కార్యదర్శి కైలాసం పిలుపునిచ్చారు. విశాఖమన్యంలో తమపై దాడి జరిగిన నేపథ్యంలో, మావోయిస్టులు బంద్ కు సిద్ధమయ్యారు. పోలీసులు, రౌడీలు, ప్రజావ్యతిరేక శక్తులు ఏకమై ఈ దాడికి పాల్పడ్డాయని కైలాసం అన్నారు. భయంతోనే తప్ప మావోయిస్టులకు ప్రజలు అండగా లేరని ఏపీ డీజీపీ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు... ఫాసిస్టులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు.