: తెలుగువారికి ఇద్దరు సీఎంలు వచ్చారు తప్ప ఒరిగిందేమీ లేదు: రాఘవులు


రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత తెలుగు ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు తప్ప, వారికి ఒరిగిందేమీ లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని తాము ముందు నుంచి చెబుతూనే వచ్చామని... ఇప్పుడదే జరిగిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మాని... సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇద్దరు సీఎంలు కూర్చుని విద్యుత్ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News