: మహిళా డైరెక్టర్లున్న ప్రైవేట్ కంపెనీలకు మెరుగైన లాభాలట!


మహిళా డైరెక్టర్లు బోర్డుల్లో ఉంటేనే కంపెనీలకు లాభాలు వస్తాయా? అంటే, అవుననే అంటోంది ఇండియా టుడే నేతృత్వంలో జరిగిన ఓ సర్వే. ఏడాదిగా కొనసాగిన ఈ సర్వేలో... డైరెక్టర్ల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం లేని కంపెనీల కంటే మహిళలున్న కంపెనీలే ఎక్కువ లాభాలను ఆర్జించాయని తేలింది. ఈ రెండు తరహా కంపెనీల మధ్య ఈ విషయంలో చాలా వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. మహిళల ప్రాతినిధ్యం ఉన్న కంపెనీలు తమ వాటాలపై 4.4 శాతం లాభాలను ఆర్జిస్తే, అదే సమయంలో కేవలం పురుష డైరెక్టర్లున్న కంపెనీలు 1.8 శాతం రాబడినే నమోదు చేశాయని సదరు సర్వే తేల్చింది.

  • Loading...

More Telugu News