: బడ్జెట్ సమావేశాల్లోపే టీ-కేబినెట్ విస్తరణ
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ త్వరలో జరగబోతోందట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే తన కేబినెట్ ను విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసేందుకు కేసీఆర్ ఆదివారం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కేబినెట్ విస్తరణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తమ సన్నిహితులకు చెప్పారని వినికిడి. కేబినెట్ విస్తరణలో భాగంగా మహిళా సభ్యులకు అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.