: త్వరలో వైఎస్సార్సీపీ మాసపత్రిక ‘ప్రజా ప్రస్థానం’


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ప్రస్థానం’ పేరిట త్వరలో మాస పత్రికను తెరపైకి తీసుకు రానుంది. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను అట్టడుగు స్థాయి కార్యకర్తల వద్దకు తీసుకెళ్లే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. విజయవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మాసపత్రికతో పాటు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ టీవీ ఛానెల్ ను కూడా ప్రారంభించనున్నామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News