: దర్శకుడిని మాటల్లో పెట్టి ఫోన్ కొట్టేసిన మాయ'లేడీ'


ఫ్రొఫెసర్, అమ్రాపాలి, దో రహేన్, ఉత్తరయాన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నిన్నటి తరం బాలీవుడ్ దర్శకుడు లేఖ్ టాండన్ మొబైల్ ఫోన్ ను మాటల్లో పెట్టి ఓ మాయలేడి కొట్టేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే, త్వరలో తాను నిర్మించబోయే సినిమాకి దర్శకత్వం వహించాలని కోరుతూ ఓ మహిళ సీనియర్ దర్శకుడు లేఖ్ టాండన్ కి ఫోన్ చేసింది. ఆ సినిమా గురించి చర్చించాలని చెబుతూ ఆయన వద్దకు వచ్చింది. టాండన్ ను మాటల్లో పెట్టిన ఆ మహిళ, తన ఫోన్ బ్యాటరీ డిశ్చార్జి అయిందని, 'అర్జంటుగా ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇవ్వండ'ని చెబుతూ అతనికి చెందిన ఐఫోన్ 5 తీసుకుంది. ఫోన్ తీసుకుని మాట్లాడుతూ అక్కడి నుంచి పరారైందని, దాని ఖరీదు సుమారు 30 వేల రూపాయలు ఉంటుందని ఆయన థానే నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News