: ఇదీ శ్రీశైలం వివాదం... పరిష్కరించరూ!: గవర్నర్ ను కలసిన రెండు రాష్ట్రాల నేతల


శ్రీశైలం విద్యుత్ వివాదం గవర్నర్ నరసింహన్ చెంతకు చేరింది. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఆరోపణలు సంధించుకున్నాయి. తమ తమ వాదనలు వినిపించాయి. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా గవర్నర్ ను కలసి తమ అభ్యంతరాలను, భవిష్యత్ అవసరాలను గవర్నర్ కు విపులంగా వివరించారు. ఈ రోజు నిర్వహించిన సాగునీటి సమీక్ష అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గవర్నర్ ను కలసి, శ్రీశైలం విద్యుత్ పై తమ వాదనలు వినిపించారు. కాగా, గవర్నర్ స్పందనను ఎవరూ తెలుపకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News