: మీరేమైనా ఫ్యాక్షనిస్టులా?: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించిన రఘువీరా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ఫ్యాక్షనిస్టుల్లా పోరాటాలకు సై అంటే సై అంటున్నారని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, 'మీరిద్దరూ ముఖ్యమంత్రులా? లేక ఫ్యాక్షనిస్టులా?' అని ప్రశ్నించారు. 'ఇష్టమొచ్చినట్టుగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. రాయలసీమ ప్రజల భవిష్యత్ తాగునీరు అవసరాల సంగతేంటని' ఆయన నిలదీశారు. సాగునీటికి కటకటలాడేలా చేసిన పాలకులు, తాగునీటికి కూడా కటకటలాడేలా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. వివాదానికి స్వస్తి చెప్పి రాయలసీమ ప్రజల భవిష్యత్ అవసరాలు గుర్తించండని ఆయన హితవు పలికారు.