: 16 పార్టీల ఎంపీలకు ప్రధాని తేనీటి విందు
ప్రధాని నరేంద్రమోడీ ఎంపీలకు ఇస్తున్న తేనీటి విందు ప్రారంభమైంది. కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టిన తరువాత తొలిసారిగా మిత్రపక్షాలతో పాటు తమ ఎంపీలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో టీడీపీతో పాటు బీజేపీ మిత్ర పక్షాలైన మొత్తం 16 పార్టీల ఎంపీలు పాల్గొనడం విశేషం. ప్రధాని అధికారిక నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ లో ఈ విందు జరుగుతోంది. ఈ తేనీటి విందులో మహారాష్ట్రలో అధికారం చేపట్టడంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విందులో శివసేన పార్టీ కూడా పాల్గోవడం విశేషం.