: సాగర్ లో విద్యుదుత్పత్తి నిలిపివేత
నాగార్జున సాగర్ లో విద్యుదుత్పత్తిని తెలంగాణ సర్కారు ఆదివారం మధ్యాహ్నం నిలిపివేసింది. అల్ప పీడన ద్రోణి కారణంగా శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో పాటు విద్యుత్ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో జెన్ కో అధికారులు సాగర్ వద్ద విద్యుదుత్పత్తిని నిలిపివేశారు.