: నవంబర్ 6న టీటీడీ 'మనగుడి' ఆరో విడత కార్యక్రమం
'మనగుడి'లో భాగంగా ఆరో విడత కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 6న నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ జేఈఓ భాస్కర్ తిరుపతిలోని ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 54 వేల ఆలయాల్లో మనగుడి కార్యక్రమాలు జరగనున్నాయి. పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, శ్రీవారి ఆలయం నుంచి కంకణాలను మనగుడి కార్యక్రమాలు జరిగే ఆలయాలకు పంపించనున్నారు. ఈ దఫా మనగుడిలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ధర్మధ్వజంను కూడా ఆలయాలకు పంపనున్నట్లు ఈ సందర్భంగా భాస్కర్ ప్రకటించారు.