: నెల్లూరులో అక్రమ కట్టడాల కూల్చివేత... అడ్డుకుంటున్న ప్రజలు
నెల్లూరు నగరంలో రోడ్ల విస్తరణలో భాగంగా కట్టడాల తొలగింపు కార్యక్రమం ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ముందస్తు నోటీసులు లేకుండానే మున్సిపల్ అధికారులు కట్టడాలను కూల్చివేస్తున్నారని ఆరోపించిన స్థానికులు కూల్చివేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, నగర వాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కూల్చవేతలను చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. రోడ్లను వెడల్పు చేసేందుకే ఈ కూల్చివేతను చేపట్టినట్లు వారు చెప్పారు.