: మరో మూడు రోజుల పాటు వర్షాలు


ఈశాన్య రుతుపవనాల కారణంగా మరో మూడు రోజుల పాటు ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే శనివారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాల్లో జన జీనవం భారీగా స్తంభించింది. కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు సమాచారం. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లోకి నీరు చేరిపోయింది. మాచర్ల-గుంటూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో కాల్వలకు గండ్లు పడ్డాయి. అల్ప పీడన ద్రోణి కారణంగా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News