: అమెరికాలో వేగంగా దూసుకెళుతున్న కంపెనీల్లో ఆరు మనవాళ్లవే!


అమెరికా పారిశ్రామిక రంగంలో శరవేగంగా వృద్ధి సాధిస్తున్న వంద కంపెనీల్లో ప్రవాస భారతీయులకు చెందినవి 6 ఉన్నాయి. అమెరికా కంపెనీలకు దీటుగా ఈ కంపెనీలు వృద్ధి బాటలో పరుగులు పెడుతున్నాయి. అంతేకాక ఆ దేశ కంపెనీల కంటే మెరుగైన రీతిలో మనోళ్ల కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫార్చ్యూన్, ది ఇనిషియేటివ్ ఫర్ ఏ కాంపిటీటివ్ ఇన్నర్ సిటీలు సంయుక్తంగా వెలువరించిన వంద కంపెనీల జాబితాలో ప్రవాస భారతీయుడు పెర్రీ మెహతా చేతిలో పురుడు పోసుకున్న ఫార్చ్యూన్ నెట్ గ్రూపు 17వ స్థానంలో నిలిచింది. డెట్రాయిట్, మిచిగాన్ కేంద్రాలుగా నిర్మాణ, పర్యావరణ, సాంకేతిక, భద్రతా రంగాల్లో మెహతా కంపెనీ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తోంది. మరో ప్రవాస భారతీయుడు శ్యాం గులాటీ నేతృత్వంలోని ఇన్ఫో పీపుల్ కార్పోరేషన్ 30 వ స్థానంలో నిలవగా, ధ్రువ్ అగర్వాల్ స్థాపించిన ట్రూ ఫ్యాబ్రికేషన్స్ 43వ స్థానం సంపాదించింది. మ్యాక్స్ కోఠారి ప్రారంభించిన ఎక్స్ ప్రెస్ కిచెన్స్ 67వ స్థానంలో నిలిచింది. ఇక ప్రవాస భారతీయులకు చెందిన వెస్ట్ కోస్ట్ ట్రక్కింగ్, స్టార్ హర్డ్ వేర్ లు కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి.

  • Loading...

More Telugu News