: ఎబోలా కేసులు 10,000 దాటిపోయాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రాణాంతక వ్యాధి ఎబోలా బారిన పడ్డ వారి సంఖ్య 10 వేల మార్కును దాటిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. శనివారం నాటికి 10,141 కేసులు నమోదు కాగా, 4,922 మంది రోగులు మరణించారని ఆ సంస్థ తెలిపింది. గినియా, లైబీరియా, సియోర్రాలియోన్ తదితర దేశాల్లో వెలుగు చూసిన ఎబోలా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తక్షణమే మేల్కొనకపోతే వారానికి 10 వేల కొత్త కేసులు నమోదయ్యే దుస్థితి నెలకొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.