: ఏపీ రాజధాని... తుళ్లూరు!


నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా తుళ్లూరు మండలం ఎంపికైంది. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం నాటి పార్టీ ఎంపీల భేటీ సందర్భంగా దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నారు. తుళ్లూరుకు కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలోనే కృష్ణా నది ప్రవహిస్తోంది. ఇక అమరావతికి 20 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రదేశం వుంది. విజయవాడకు 25 కిలో మీటర్లు, గుంటూరుకు 33 కిలో మీటర్ల దూరంలో తుళ్లూరు ఉంది. ఇక జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరికి ఇది కేవలం 20 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. దీంతో అన్ని రకాలుగా తుళ్లూరు మండలమే కొత్త రాజధానికి అనువుగా ఉందని చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయపడింది. మండలంలోని 30 వేల ఎకరాల విస్తీర్ణంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసేందుకు త్వరలో కసరత్తు మొదలు కానుంది.

  • Loading...

More Telugu News