: బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ చేపట్టండి: ఈసీకి కాంగ్రెస్ సూచన


ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ తొక్కుతున్న అడ్డదారులపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఢిల్లీ ఎన్నికలంటేనే భయపడిపోతున్న బీజేపీ, ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు అక్రమాలకు తెరతీసిందని ఆప్ తో పాటు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో తన అధికారాన్ని దుర్వినియోగం చేయదని ఎన్నికల సంఘం తమకు హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత జేపీ అగర్వాల్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News