: నేడే హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణం


హర్యానా సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే మనోహర్ లాల్ ఖట్టర్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సుదీర్ఘకాలం ఆరెస్సెస్ లో కొనసాగిన ఖట్టర్, తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలి దఫాలోనే ఖట్టర్ సీఎం కుర్చీపై కూర్చునేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. పంచ్ కులలో జరగనున్న ఖట్టర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇదిలా ఉంటే, హర్యానా సీఎం పీఠం నుంచి దిగిపోతున్న కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడాకు కూడా ఆహ్వానం పంపినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఖట్టర్ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు లక్ష మంది ప్రజలు హాజరుకానున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News