: ఈసారి మోదీ వంతు... ధరూర్ ను అభినందించారు


ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత శశిధరూర్ మధ్య పొగడ్తల వర్షం ఆగడం లేదు. అద్భుతంగా పని చేస్తున్నారని, తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యుత్తమమంటూ ప్రధానిని ధరూర్ ప్రస్తుతించినందుకు పదవిని కూడా పోగొట్టుకున్నారు. తాజాగా ఆయన పిలుపునిచ్చిన విధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని బీచ్ ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను శశిధరూర్ ట్వీట్ చేశారు. వాటిని చూసిన ప్రధాని మోడీ పారిశుద్ధ్య కార్యక్రమంలో ధరూర్ పాల్గోవడం ప్రోత్సాహకరమని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు ధరూర్ ట్వీట్ చేసిన ఫోటోలను జత చేసి రీట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News