: దిగ్గజ సైంటిస్ట్ ఫేస్ బుక్ పేజ్ కు లైకుల వెల్లువ


ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్స్ సోషల్ మీడియాలో చేరారు. ఫేస్ బుక్ లో చేరుతూనే, 'ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండండి' అంటూ ఆయన సూచించారు. ఆయన అక్టోబర్ 7న ఫేస్ బుక్ లో చేరిన కొద్ది రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా నెటిజన్లు ఆయనను అనుసరించడం ప్రారంభించారు. ఆయన ఫేస్ బుక్ పేజ్ కు లైకుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. దీంతో సామాజిక అనుసంధాన వేదికల్లో సినీ తారలకే కాదు, సైంటిస్టులకు కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారని స్టీఫెన్ హాకింగ్స్ నిరూపించారు.

  • Loading...

More Telugu News