: ఐదేళ్లలో ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం ఐదేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. రాజధాని సలహా సంఘంతో సమావేశమైన అనంతరం హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపడతామని తెలిపారు. భూసమీకరణ ద్వారానే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూసమీకరణకు సహకరించకపోతే భూసేకరణ విధానంతో ముందుకెళ్తామని ఆయన వివరించారు. భూసమీకరణకు రైతులు ముందుకొస్తే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపునిస్తామని బాబు వెల్లడించారు. భూసమీకరణ కోసం త్వరలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని ఆయన వివరించారు.