: భార్యా,భర్తలు ఊబకాయం బారిన పడడానికి కారణం ఇదే!


మీ భార్యా భర్తలిద్దరూ కీచులాడుకుంటున్నారా? అయితే, మీరు ఊబకాయం బారినపడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తరచూ గొడవపడే భార్యా భర్తలు డిప్రెషన్ బారిన పడి ఊబకాయులుగా తయారవుతున్నారని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అలా తరచూ ఘర్షణ పడడం వల్ల వారిలో మెటబాలిజం దెబ్బతింటుందని, దీని వల్ల రక్తంలోని ఇన్సులిన్ ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా, రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశోధన కోసం పెళ్లయి కనీసం మూడేళ్లు దాటిన 24-60 ఏళ్ల లోపు 43 ఆరోగ్యవంతమైన జంటలను ఎంచుకున్నారు. వారి వైవాహిక జీవితం, గతంలో వారి మూడ్ డిజార్డర్లు, డిప్రెషన్ వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. వైవాహిక జీవితంలో సఖ్యత లేని జంటలు, డిప్రెషన్ కు లోనయ్యే జంటలు, మూడ్ డిజార్డర్ లో ఉన్న జంటల్లో 12 శాతం కన్నా ఎక్కువ ఇన్సులిన్ రక్తంలో పెరగడాన్ని పరిశోధకులు గుర్తించారు. అలాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువగా ఉండడం వారు గమనించారు. తక్కువ స్థాయిలో విభేదాలు ఉన్న జంటల్లో దీని శాతం తక్కువగా ఉండడాన్ని వారు గుర్తించారు. ఈ ట్రైగ్లిజరైడ్స్ గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని వారు సూచించారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే అన్ని విధాలా మేలు అని సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News