: ప్రధాని తన ఫొటోలు తీయడంతో పొంగిపోతున్న బీజేపీ ఫోటోగ్రాఫర్


ఢిల్లీలో శనివారం నాడు గమ్మత్తైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోదీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ అఫిషియల్ ఫోటోగ్రాఫర్ అజయ్ కుమార్ సింగ్ ప్రధానిని వివిధ యాంగిల్స్ లో కెమెరాలో బంధిస్తూ బిజీగా ఉన్నాడు. ఆశ్చర్యకరంగా మోదీ ఆ ఫోటోగ్రాఫర్ వద్దకు వచ్చి, కెమెరా తన చేతిలోకి తీసుకున్నారు. దాన్ని కాసేపు పరిశీలించిన పిమ్మట, ఫోటోగ్రాఫర్ అజయ్ కుమార్ ను కొన్ని ఫోటోలు తీశారు. దీంతో, అజయ్ కుమార్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. దీపావళికి లభించిన అతిపెద్ద బహుమతిగా భావిస్తానని, ప్రధాని తీసిన ఫోటోను ఇంట్లో పెట్టుకుంటానని చెప్పాడు. తన ఫోటోొను ప్రధాని చాలా నేర్పుగా తీశారని కితాబిచ్చాడు.

  • Loading...

More Telugu News