: సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ ఒకటి ఏర్పాటైంది. పలువురు నిర్మాతలు, దర్శకుల సహకారంతో ఈ ఫిలిం ఛాంబర్ ను ఏర్పాటు చేశామని సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ దిలీప్ రాజా తెలిపారు. సినీ పరిశ్రమలో వివాదాలు సహజమని చెప్పిన ఆయన, విజయవాడలో సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు. గుంటూరు, విజయవాడ మధ్య సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన చెప్పారు.