: క్వార్టర్స్ లో చతికిలబడ్డ సైనా


భారత నెంబర్ వన్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్ లో చతికిలపడింది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ లో గంటా పది నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన రెండవ సీడ్ క్రీడాకారిణి పిసియాన్ వాంగ్ చేతిలో సైనా 19-21, 21-19, 15-21తో ఓటమిపాలైంది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ లో భారత పోరాటం ముగిసింది. కాగా, ఈ టోర్నీ మహిళల విభాగంలో సెమీస్ చేరుకున్న వారిలో ముగ్గురు చైనీయులే ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News