: తుపాను బాధితులకు ఏపీ ఎంపీల ఆర్థిక సాయం
ఉత్తరాంధ్ర తుపాను బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎంపీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున ఇస్తారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇందుకు 26 మంది ఎంపీలు అంగీకరించారన్నారు.