: 'హ్యాపీ న్యూ ఇయర్'కు అసాధారణ స్పందన
నటుడు షారుక్ ఖాన్ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి బాక్సాఫీసు వద్ద అమోఘమైన స్పందన లభించింది. ఫరాఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ తొలిరోజే రికార్డు సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం, మొదటిరోజే భారీగా వసూలు చేసిందట. ఈ క్రమంలో హిందీలో రూ.42.62 కోట్లు, తెలుగులో రూ.1.43 కోట్లు, తమిళంలో రూ.92 లక్షలు రాబట్టిందట. మొత్తం కలిపి 44.97 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీపికా పదుకొనె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, ఆకట్టుకునే సంగీతం, భారీ తారాగణం, అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహాలతో సినిమా ఓపెనింగ్ రోజునే బాక్సాఫీసు వద్ద ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ ను సాధించుకున్నట్లు వివరిస్తున్నారు.