: అన్ని పార్టీల నేతలు చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలి: కోమటిరెడ్డి


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతుల పాలిట చంద్రబాబు శత్రువుగా మారాడని విమర్శించారు. బాబు కుట్రలకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు ఆయన ఇంటి ఎదుట ధర్నా చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు కారణమైన బాబు, ఆంధ్రా రైతులను కూడా మాయ చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ నేతలు చంద్రబాబు మాయలో పడరాదని సూచించారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన కరెంటును ఆయన ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News