: సమస్యను పరిష్కరించుకోలేక చంద్రబాబును నిందిస్తున్నారు: నారా లోకేష్


తెలంగాణలో విద్యుత్ సమస్యపై ఆ రాష్ట్ర ప్రభుత్వం, నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. తమ రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కరించుకోలేక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలు వేస్తున్నారని విలేకరులతో అన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్... ఇప్పుడు మూడేళ్లు పడుతుందంటున్నారని విమర్శించారు. ఇలాగే పోతే సమస్యకు ప్రజలే కారణమని అంటారేమోనని లోకేష్ వ్యంగ్యాస్త్రం సంధించారు.

  • Loading...

More Telugu News