: కేసీఆర్ కుటుంబంపై ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి: ఎర్రబెల్లి


తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై ఫోర్ ట్వంటీ (420) కేసులు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన హామీలను మరిచిన కేసీఆర్, తెలంగాణ ప్రజలను మోసగించారని ఆరోపించారు. శనివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతల భేటీ జరిగింది. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఎర్రబెల్లి... కేసీఆర్, ఆయన కుటుంబంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయానికి ఎనిమిది గంటల పాటు విద్యుత్ ఇస్తానని చెప్పిన కేసీఆర్, గద్దెనెక్కగానే రైతులను నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. తెలంగాణకు తొలి సీఎంను దళితుడిని చేస్తానని, లేకుంటే తన తల నరుక్కుంటానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రం రాగానే పీఠంపై కూర్చున్నారని విమర్శించారు. కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ ను తెస్తానని చెప్పిన మాట ఏమైందని కేసీఆర్ ను ఎర్రబెల్లి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News