: రాజీనామాకు దేవినేని సిద్ధంగా ఉండాలి: కేటీఆర్
శ్రీశైలం జల విద్యుదుత్పత్తిపై ఏపీ మంత్రి దేవినేని చేసిన వాదన అసంబద్ధంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవినేని పిలుపు మేరకు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. చర్చలో తెలంగాణ ప్రభుత్వ వాదనే సరైనదని ఏపీ ప్రభుత్వం చేత అంగీకరింపజేస్తామని చెప్పారు. తమ వాదన కరెక్టయితే రాజీనామా చేస్తానన్న దేవినేని, తన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే, కేసీఆర్ వ్యాఖ్యలపై టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.