: హాకీ లీగ్ లో ధోనీ జట్టు!
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో లీగ్ లో అడుగుపెట్టాడు. హకీ ఇండియా లీగ్ పేరిట రంగ ప్రవేశం చేయనున్న కొత్త లీగ్ లో ప్రవేశించిన ధోని, రాంచీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. సహారా అడ్వెంచర్స్ స్పోర్ట్స్ తో కలిసి ధోనీ ఆ జట్టును కొనుగోలు చేశాడు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ లో చెన్నై జట్టు సహ యజమానిగా కొనసాగుతున్న ధోనీ తాజాగా హాకీ లీగ్ లోనూ కాలుమోపాడు.