: కేసీఆర్ కు చట్టాలపై అవగాహన లేదు: కేఈ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చట్టాలపై అవగాహన లేదని... అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. నిపుణులను సంప్రదించి చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. విద్యుత్ కు సంబంధించి అనవసరంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలు వేయడం తగదని హితవు పలికారు. రాయలసీమ వాసుల నీటి అవసరాల కోసం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సిందే అని డిమాండ్ చేశారు. కృష్ణా రివర్ బోర్డుకు పూర్తి అధికారాలు కల్పించాలని అన్నారు.

  • Loading...

More Telugu News