: కోడి పందేలు నిర్వహిస్తున్న రుమేనియా యువరాణికి మూడేళ్ళ ప్రొబేషన్
రుమేనియా యువరాణి ఇరినా వాకర్ (61), ఆమె భర్త జాన్ వాకర్ (68) కోడి పందేల కేసులో దోషులుగా తేలారు. వారు అమెరికాలోని ఇర్రిగాన్ లోని తమ బీడు భూమిలో అక్రమంగా కోడి పందేలు నిర్వహిస్తున్నట్టు నిరూపితమైంది. దీంతో వారికి మూడేళ్ళ ప్రొబేషన్ విధించారు. అంతేగాకుండా, రూ.1.20 కోట్లు జరిమానాగా చెల్లించాలని పేర్కొంది. వాకర్ దంపతులను ఈ కేసులో 2013లో అరెస్టు చేశారు. ప్రొబేషన్ లో ఇరినా విదేశాలకు వెళ్ళేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఆమె వృద్ధుడైన తన తండ్రి మైకేల్ (93)ను పరామర్శించేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించారు. విచారణ సందర్భంగా న్యాయస్థానానికి రుమేనియా యువరాణి సారీ చెప్పారు. కాగా, యువరాణి గారు నిర్వహించే ఈ కోడిపందేలు తిలకించాలంటే రూ.1200, పాల్గొనాలంటే రూ. 61000 చెల్లించాలట. ఇక, మెక్సికన్ వంటకాలు, మద్యం సరేసరి.