: దేశాన్ని మార్చేందుకు మీ సహకారం కావాలి: మీడియాతో మోదీ


దేశ రూపురేఖలు మార్చేందుకు తాము కంకణబద్ధులమై ఉన్నామని, అందుకు సహకారం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియా ప్రతినిధులను కోరారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దివాలీ మిలాన్ ను పురస్కరించుకుని తొలిసారి మీడియాతో భేటీ అయిన మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. మీడియా ప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి సమావేశాన్ని ప్రారంభించిన మోదీ, మీడియాతో తాము సత్సంబంధాలను నెరపుతామని ప్రకటించారు. తమ పనితీరు వల్లే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో విజయం సాధించామని మోదీ చెప్పారు.

  • Loading...

More Telugu News