: ఆచారాల పేరిట మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట!


ఏళ్ళుగా వస్తున్న ఆచారమంటూ రాజస్థాన్ లోని అజ్మీర్ ప్రజలు ఎంతటి మూర్ఖత్వానికి ఒడిగట్టారో చూడండి! దీపావళిని పురస్కరించుకుని ఒకరిపై మరొకరు బాణాసంచా విసురుకున్నారు. బాణాసంచా కారణంగా తీవ్ర గాయాలపాలయ్యారని, చూపును కోల్పోయారని మీడియాలో వచ్చే వార్తలు కూడా ఈ అనారోగ్యకర సంప్రదాయాన్ని నిలువరించలేకపోయాయి. దీపావళి మరుసటి రోజు స్థానికులే ఈ విధమైన యుద్ధం అనదగ్గ పోటీ ఏర్పాటు చేశారు. పోటీలో భాగంగా తీవ్రస్థాయిలో ధ్వనిపుట్టించే బాంబులను, రాకెట్లను ఒకరిపై ఒకరు విసురుకోవాలి. మూడు దశబ్దాలుగా సాగుతున్న ఈ ప్రమాదకర పోటీని పాలనా యంత్రాంగం కూడా అడ్డుకోలేకపోతోంది. గాయాలవుతాయని, కొన్నిసార్లు జీవితమే ప్రమాదంలో పడుతుందని తెలిసి కూడా ఇక్కడి యువత ఆచారం పేరిట ఇలాంటి క్రీడల్లో పాల్గొనడాన్ని మూర్ఖత్వం అనక ఇంకేమనాలి?

  • Loading...

More Telugu News