: నేడు మీడియాతో మోదీ ప్రత్యేక భేటీ


ప్రధాని నరేంద్ర మోదీ నేటి మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మోదీకి అత్యంత సన్నిహితులుగా ఉండే పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్ వద్ద సైనికులతో ఉల్లాసంగా గడిపిన మోదీ, దివాలీ మిలాన్ ను పురస్కరించుకుని నేడు మీడియాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మోదీ మాట్లాడనున్నారు. ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత మీడియా ప్రతినిధులతో మోదీ భేటీ జరుపుతుండటం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News