: 'స్వచ్ఛ్ భారత్'లో నేడు పాల్గొంటున్న శశిథరూర్
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఎంపీ శశిథరూర్ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో నేడు 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఈ మేరకు చీపురు పట్టి తన నియోజకవర్గం తిరువనంతపురంలోని బీచ్ లో థరూర్ శుభ్రం చేయనున్నారు. "విజింజమ్ బీచ్, ఓ అద్భుతమైన ప్రదేశం. మురికి, చెత్త మూలంగా పాడైంది. ఈ క్రమంలో స్థానిక వ్యక్తులతో కలసి ఇక్కడ క్లీన్ చేయనున్నాం" అని థరూర్ ట్వీట్ చేశారు.