: లంచం సొమ్ము డ్రైనేజి పైపుల్లో దాచాడు!
రెండ్రోజుల క్రితం సీబీఐ ఢిల్లీలో సీనియర్ రైల్వే అధికారి రవిమోహన్ శర్మను అరెస్టు చేసింది. ప్రత్యేక రైళ్ళకు అదనపు బోగీలు ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేటు టూర్ ఆపరేటర్ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో శర్మను సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా, ఆయన నివాసంపై దాడి చేసి పెద్ద ఎత్తున నగదు, అరడజను ల్యాప్ టాప్ లు, ఖరీదైన ఐ-ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తమ దాడుల సందర్భంగా శర్మ రూ.10 లక్షల నగదును డ్రైనేజి పైపుల్లో దాచిన విషయం బయటపడిందని సీబీఐ అధికారులు తెలిపారు. సోదాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ లంచగొండి అధికారికి నాలుగు రోజుల కస్టడీ విధించారు.