: నేడు ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
తెలుగు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కోసం కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నేడు మరోమారు భేటీ కానుంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరవుతున్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాలనలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యంతరాలున్న అధికారులను మినహాయించి, అభ్యంతరాలు లేని అధికారులను విభజించేందుకు పరస్పరం సహకరించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించిన నేపథ్యంలో నేటి భేటీ సత్ఫలితాలిచ్చే సూచనలే కనిపిస్తున్నాయి.