: తెలుగు రాష్ట్రాల వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధం: గద్దర్
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం నెరపేందుకు తాను సిద్ధమని ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో తెలుగు ప్రజల మధ్య విభేదాలు పొడచూపే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం కాగలవని, ఆ దిశగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అడుగేయాలని పిలుపునిచ్చారు.