: నేడు ఏపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ


ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. హుదూద్ తుపాను నేపథ్యంలో కేంద్రం నుంచి అందాల్సిన సహాయంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు లేక్ వ్యూ అతిథి గృహంలో ప్రారంభం కానున్న ఈ సమావేశం మధ్యాహ్నం దాకా కొనసాగనుంది. హుదూద్ తుపాను సహాయమే కాక, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల నిధులు, ఇతర ప్రాజెక్టుల అనుమతులు తదితరాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చిస్తారు.

  • Loading...

More Telugu News