: చైనా, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో మరో 54 ఔట్ పోస్టులు నిర్మిస్తాం: రాజ్ నాథ్
భారత్, చైనా సరిహద్దును సైనిక పరంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరో 54 ఔట్ పోస్టులను నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని అప్పుడప్పుడు చైనా అంటున్న విషయం తెలిసిందే. రాజ్ నాథ్ మాట్లాడుతూ, పొరుగు దేశాలతో భారత్ ఎల్లప్పుడూ శాంతిని, స్నేహాన్నే కోరుకుంటుందని అన్నారు. సరిహద్దు సమస్యలన్నింటినీ సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలనేది భారత్ అభిమతమని చెప్పారు. మరోవైపు, సరిహద్దుల్లో పాక్ బలగాలు కాల్పులను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.