: నవంబర్ 5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నవంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పటిదాకా సమావేశాలు కొనసాగుతాయన్న విషయాన్ని మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించలేదు. సమావేశాలు సుదీర్ఘంగానే కొనసాగుతాయని మాత్రమే ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో, ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.